Amardeep mother: కాబోయే కోడలి గురించి షాకింగ్ కామెంట్లు చేసిన అమర్ దీప్ తల్లి..!

Amardeep mother: బుల్లితెర నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అమర్ దీప్ ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఇటీవలే బుల్లితెర నట తేజస్వినితో ఘనంగా నిశ్చితార్థం కూడా చేస్కున్నాడు. ఇకపోతే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రహస్యంగా వీరిద్దరూ ప్రేమాయణం చేసి నిశ్చితార్థంలో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే మల్లికా(విష్ణు ప్రియ) ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బయట పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమర్ తన ప్రేమ విషయాన్ని ముందుగా తనతోనే చెప్పారని హహస్యంగా ఉంచడానికి ఓ కారణం ఉందన్నారు.

ఇలా తనని అమర్ అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడని వివరించింది. జానకి పాత్రలో నటించిన ప్రియాంక, విష్ణుప్రియ ఇద్దరూ గదిలో తయారవుతుండగా… అమర్ దీప్ తల్లి అక్కడికి వచ్చారని చెప్పారు.. కాబోయే కోడలు ఎలా ఉండాలని అడగ్గా.. నేను ఎలా ఉండాలనుకున్నానో నా కోడలు అచ్చం అలాగే ఉందంటూ ఆమె మురిసిపోయారు. ఎంతో అందమైన కోడలు, మంచి సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel