Karthika Deepam: మోనిత వాళ్లబాబాయ్‌కి కార్తీక్‌ ఆపరేషన్‌ చేస్తాడా?.. దీప మోనిత కుట్రను ఎలా ఎదుర్కోనుంది?

Updated on: February 21, 2022

Karthika Deepam: టీవీ ప్రపంచంలో తెలుగునాట అత్యంత ప్రేక్షకాధరణ పొందిన ధారావాహిక ” “కార్తీకదీపం”. మరి ఈ సీరీయల్‌ 21 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 1281 హైలైట్స్ ఏంటో చూద్దామా..! మోనిత అసలు నీకు ఎందుకు హెల్ప్ చేసింది. ఏదైనా దుర్మార్గపు ఆలోచన చేస్తుందేమోనని దీప భయం అని సౌందర్య.. కార్తీక్‌తో చెబుతుంది. అప్పుడే మోనిత ఫోన్ చేస్తుంది. బాబాయి ఆపరేషన్ చేస్తావా అని మరోసారి అడుగుతుంది. దీంతో మీ బాబాయికి ఆపరేషన్ చేస్తా కానీ.. నీ విషయం ఏంటి.. నువ్వు నీ మాట మీద నిలబడతావా అని అడుగుతాడు కార్తీక్. ఫోన్ లౌడ్ స్పీకర్ పెడతాడు. అదేంటి కార్తీక్ అంత స్ట్రాంగ్‌గా చెప్పాను కదా అన్నీ మానేస్తాను. హాస్పిటల్ కూడా తీసేస్తానని చెప్పాను కదా అంటుంది మోనిత. దీంతో థాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

karthika deepam serial latest episode

విన్నారు కదా.. నేను చేయలేని పనిని.. అసాధ్యమైన పనిని అడగలేదు మోనిత. నాకు సాధ్యమైన పనినే అడిగింది. ఒక డాక్టర్‌గా నా పని నేను చేస్తాను. ఈ సర్జరీ చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతాడు కార్తీక్. ఇంతలో పిల్లలు వచ్చి నాన్న.. అమ్మ తాడికొండ వెళ్లింది. మా స్కూల్ టీసీలు, ఇంకా ఏవో పనులు ఉన్నాయట. రేపు వస్తానంది అంటారు పిల్లలు. దీంతో రేపు కాకుంటే ఎల్లుండి రమ్మనండి అని చెప్పి కోపంగా కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

కట్ చేస్తే ఆసుపత్రికి వెళ్లి ఓ నర్సుతో తన ప్లాన్ గురించి చెబుతుంది. తను చెప్పినట్టు చేస్తే డబ్బులు ఇస్తానని ఆశ చూపిస్తుంది మోనిత. కానీ.. ఆ నర్సు మాత్రం నేను ఈ పని చేయను అని చెబుతుంది. అంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. మోనిత నీతో మాట్లాడాలి.. నా క్యాబిన్‌కు రా అంటాడు.

దీంతో మోనిత టెన్షన్ పడుతుంది. ఆపరేషన్ పేరుతో నువ్వేమీ కుట్ర పన్నడం లేదు కదా అని అడుగుతాడు. దీంతో కార్తక్‌ కాళ్లు పట్టుకొని కన్నీళ్లు కారుస్తుంది. తన కన్నీళ్లు చూసి కార్తీక్ పడిపోతాడు.

మరోవైపు మోనిత బాబాయితో మాట్లాడేందుకు సౌందర్య బస్తీకి వెళ్తుంది. లక్ష్మణ్, వారణాసితో కాసేపు మాట్లాడి ఆ తర్వాత మోనిత బాబాయిని పిలవమని చెబుతుంది. నేను కార్తీక్ అమ్మను అని చెబుతుంది సౌందర్య. మా అబ్బాయి మీకు ఆపరేషన్ చేస్తాడు కానీ.. మీరు ఆపరేషన్ తర్వాత మోనితను కూడా తీసుకొని అమెరికా వెళ్లిపోవాలని చెబుతుంది సౌందర్య. అప్పుడే మోనిత వచ్చి సౌందర్య మాటలు వింటుంది. సౌందర్య మాటలు విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలంటే నెక్ట్స్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel