Exit Poll Results 2021 : గెలుపు ఆ పార్టీలదేనా?.. కన్ఫామ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్..!

Updated on: January 27, 2023

Exit Poll Results 2021 : ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్.. ఈ రెండు స్థానాలకు సంబంధించిన పోలింగ్ శనివారం పూర్తయింది. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరో వైపు నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు సైతం పంపిణీ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఎలాగో అలా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఇక ఫలితాల విషయంపై ఆయా పార్టీల్లో టెన్షన్ ఇంకా పెరిగింది. హుజురాబాద్, బద్వేల్ ఈ రెండింటి ఉప ఎన్నికల్లో దాదాపుగా అందరి చూపు హుజురాబాద్ పైనే ఎక్కువగా ఉంది.

Exit Poll Results 2021 : Which Party will Win In Huzarabad and Badvel ByPolls
Exit Poll Results 2021 : Which Party will Win In Huzarabad and Badvel ByPolls

ఈటల రాజేందర్‌‌పై పలు ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడం, తర్వాత బీజేపీలో చేరడం చకచకా అయిపోయాయి. దీంతో ఎలాగైనా పట్టును నిలుపుకునేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేసింది. ఇక ఈటల రాజేందర్ సైతం తన సెంటిమెంట్, సింపతితో ఓట్లు రాబట్టుకోవాలని ట్రై చేశారు. హుయగరాబాద్‌లో గతంలో సుమారు 84 శాతం మంది ఓటు వేయగా.. ఈ సారి దాదాపుగా 86 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక అటు పోలింగ్ అయిపోయిందో లేదో ఇటు ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి. మిషన్ చాణక్య ప్రకారం బీజేపీకి 59.2 శాతం ఓట్లతో బీజేపీ విజయం సాధిస్తుందని, 39.2 శాతం ఓట్లతో టీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమౌతుందని చెప్పింది. నాగన్న సర్వే ప్రకారం బీజేపీ 42.9 నుంచి 45.5 శాతం ఓట్ల సాధిస్తుందని, టీఆర్ఎస్ 45.3 నుంచి 48.9 శాతం ఓట్లు సాధించే అవకాశముందని తెలిపింది.

Advertisement

ఆత్మసాక్షి సర్వే విషయానికి వస్తే బీజేపీకి 50.05 శాతం, టీఆర్ఎస్‌కు 43.01 శాతం ఓట్లు పోలయ్యాయని అంచనా వేసింది. పబ్లిక్ పల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్‌కు 44.03 శాతం, బీజేపీకి 50.09 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. అయితే వీటిలో దాదాపు అన్నీ బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థినే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.

Read Also : Niloufer Boy Death : వంద రూపాయల కక్కుర్తి.. చిన్నారిని బలితీసుకున్న వార్డ్‌బాయ్‌..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel