Niloufer Boy Death : వంద రూపాయల కోసం కక్కుర్తి పడి చిన్నారి ప్రాణాలను బలిగొన్నాడో వార్డ్ బాయ్.. డబ్బులు ఇస్తేనే ఆక్సిజన్ పెడతానంటూ అలానే వదిలేశాడు. చివరికి నాలుగేళ్ల చిన్నారి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో జరిగింది. చిన్నారికి పెట్టాల్సిన ఆక్సిజన్ పైపును మరొకరికి పెట్టడంతో ఊపిరి ఆడక పసికందు ప్రాణాలు కోల్పోయింది. వార్డు బాయ్ నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని పాప తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి స్పందించారు. నీలోఫర్ ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మరణానికి కారణమైన వార్డుబాయ్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా (4) ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారికి స్కానింగ్ కోసం తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఆక్సిజన్ సీలిండర్ వెంట తీసుకెళ్లాలి. అలా ఆక్సిజన్ అందించాలంటే తనకు రూ.100 ఇవ్వాలని వార్డ్ బాయ్ బాలుడి తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. తమ దగ్గర లేవని వారు చెప్పడంతో ఆక్సిజన్ పైపును మరో బెడ్ పేషెంటుకు మార్చాడు. దాంతో ఊపిరి ఆడక బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ప్రతి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతిచెందాడంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు పిల్లాడి ఆరోగ్య పరిస్థితి తీవ్ర కావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల్లోనే రూ.2 లక్షల వరకు బిల్లు అయింది. దాంతో భరించలేక కొన్నిరోజుల క్రితమే నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చేర్పించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న చిన్నారి ఇప్పుడు ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Pawan Death Note : అమ్మా.. నాన్న.. ఈ మొబైల్ అమ్మేసి.. నా అంత్యక్రియలు చేయండి..!
Puneeth Rajkumar Death : పునీత్ డెత్‌కు కారణం అదేనా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే…