Pawan Death Note : అమ్మా.. నాన్న.. ఈ మొబైల్ అమ్మేసి.. నా అంత్యక్రియలు చేయండి..!

Son asks parents before death in note
Son asks parents before death in note

Pawan Death Note : తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. తన మొబైల్ ఫోన్ అమ్మేసి తన అంత్యక్రియలు చేయాలని అందులో కోరాడు. అమ్మా.. నాన్న నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. ఇక నేను బతకలేను. నాన్న, అమ్మ మిమ్మల్ని వదిలివెళ్తున్నాను.. క్షమించండి.. అంటూ సూసైడ్ లేఖ రాశాడు.

పదో తరగతి చదివిన పవన్ అనే బాలుడు చనిపోయే ముందు ఈ నోట్ రాశాడు. తనకు వారం క్రితం గుండెపోటు వచ్చింది. ఆ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ భయపడిపోతారో అనే భయంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలను తీసుకున్నాడు.

Advertisement

ఈ ఘటన బహదూర్‌పురాలో జరిగింది. ఇకపై నన్ను మర్చిపోవాలని, నా ఫొన్‌ అమ్మి నా అంత్యక్రియలు చేయాలని లేఖలో పేర్కొన్నాడు. అప్పుడు మాత్రమే తన ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ సూసైడ్‌ నోట్‌లో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తనకు గుండెపోటు వచ్చిందనే విషయం తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరని భావించాడు. తనలోనే తాను మదనపడిపోయాడు. ఈ విషయం పేరంట్స్‌కు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తీవ్ర భావోగ్వేదానికి లోనయ్యాడు.

Advertisement

గుండెపోటు వచ్చిందని తెలిసి ప్రతిరోజు వారిని ఇబ్బందిపెట్టే బదులు ముందుగానే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు 16ఏళ్ల బాలుడు.. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిల్చిపోయాడు. చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టుెకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న పవన్ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR దెబ్బకు వార్ వన్ సైడ్.. వచ్చే ఏడాది వరుసగా మూడు నెలల వరకు పండగే..

Advertisement