Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Election Results 2022 : 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో నేడు తేలనుంది!

Election Results 2022 : యూపీ, ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీజేపీ, పంజాబ్‌లో ఆప్‌ పార్టీ, కాంగ్రెస్‌కు మధ్య గట్టి పోటీ ఎదురవుతోంది. పంజాబ్‌లో ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఆప్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోనూ జోరుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మణిపూర్‌లోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ ... Read more

By Vinod Kumar

Published on: March 10, 2022 9:07 AM

Updated on: March 10, 2022 9:07 AM

Election Results 2022 : BJP ahead of SP in postal ballots, show trends

---Advertisement---

Election Results 2022 : యూపీ, ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీజేపీ, పంజాబ్‌లో ఆప్‌ పార్టీ, కాంగ్రెస్‌కు మధ్య గట్టి పోటీ ఎదురవుతోంది. పంజాబ్‌లో ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఆప్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోనూ జోరుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మణిపూర్‌లోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీనే ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీలో ఏ పార్టీ గెలుస్తుందనే ఆసక్తి నెలకొంది. ఓటర్లు ఏ పార్టీని అధికారంలో తీసుకొస్తారనే ఉత్కంఠ నెలకొంది. ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూపీ అధికార పీఠం ఎవరిదో తేల్చనుంది. ఇప్పటికే అన్ని సర్వే సంస్థలు బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.

Election Results 2022 : BJP ahead of SP in postal ballots, show trends
Election Results 2022 : BJP ahead of SP in postal ballots, show trends

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా? ఈ రోజుతో తేలిపోనుంది. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మార్చి 7న ఏడో రౌండ్ పోలింగ్‌తో పోలింగ్ ముగిసింది. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 స్థానాలకు ఎన్నికల జరిగాయి.

ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రానున్నాయి. యూపీలో 202, గోవాలో 21, ఉత్తరాఖండ్‌లో 36, మణిపూర్‌లో 31, పంజాబ్‌లో 59గా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఆ ఐదు రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల బీజేపీనే ఉంది. యూపీలో మళ్లీ యోగికే ప్రజలు పట్టం కట్టనున్నారా? అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల నేడు భవితవ్యం తేలనుంది.

Read Also : Horoscope Today 10 March 2022 : ఈ రోజు ఈ రాశివారికి గడ్డుకాలమే.. ఏయే రాశులతో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే?

, , , , , , , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?