Health Tips: డీహైడ్రేషన్ ను తరిమి కొట్టాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే!

Updated on: April 16, 2022

Health Tips: వేసవి కాలం మొదలవడంతో మనం తీసుకునే ఆహారం కన్నా అధిక మొత్తంలో నీటిని తాగడానికి ఇష్టపడతాము.అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం తొందరగా నీటిని కోల్పోవటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. ఇలా మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే తరచూ పానీయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.ఈవిధంగా వేసవికాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్ లు తాగడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. మరి ఆ జ్యూస్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

దోసకాయ జ్యూస్: వేసవి కాలంలో మన శరీరం తొందరగా డీహైడ్రేషన్ అవుతుంది కనుక ఎక్కువగా నీరు కలిగినటువంటి పండ్ల రసాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలోనే దోసకాయ జ్యూస్ మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. దోసకాయలు 90% నీరు కలిగి ఉంటుంది. అలాగే విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి.ఇక దోసకాయతో పాటు కొత్తిమీరను కలిపి జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తూ వేసవికాలంలో డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా వేసవికాలంలో ఈ రెండింటిని కలిపి జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కాంతివంతమైన చర్మాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు.అందుకే వేసవి కాలంలో తరచూ ఈ జ్యూస్ తాగడం వల్ల ఎంతో అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel