వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Beauty Tips: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటించాల్సిందే!

Beauty Tips:ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారికి వరకు అందరూ అందంగా కనిపించటానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవటం, బయట మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కొని అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి చిట్కాల ద్వారా అందమైన మెరిసే ... Read more

By Ramesh Babu

Published on: April 18, 2022 7:10 PM

Updated on: April 18, 2022 6:54 PM

---Advertisement---

Beauty Tips:ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారికి వరకు అందరూ అందంగా కనిపించటానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవటం, బయట మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కొని అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి చిట్కాల ద్వారా అందమైన మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. ఆ వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందరి ఇళ్ళలో పాలు ఖచ్చితంగా ఉంటాయి.ఒక కప్పులో కొంచెం సెనగపిండి తీసుకుని అందులో కొన్ని పచ్చి పాలు, పసుపు కలిపి పేస్టులా తయారు చేసుకొని ముఖానికి రాసుకోవాలి . పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మోహాన్ని కడుక్కోవటం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు, మొటిమలు తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

బాదం పొడిలో కొంచెం పచ్చి పాలు, ఓట్‌మీల్‌ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ముఖానికి ఈ పేస్ట్ ను అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం రంగు కాంతివంతంగా తయారవుతుంది. బాగా పండిన బొప్పాయి పండు మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవాలి ఒక 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల కాలుష్యం వల్ల ఏర్పడిన ట్యాన్ తొలగిపోయి మొహం కాంతివంతంగా తయారవుతుంది.

ఒక కప్పు లో కొంచెం నిమ్మరసం తీసుకుని అందులో కొంచెం రోజ్ వాటర్,చక్కెర కలిపి ముఖం మీద అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది స్ర్కబ్ లాగ పని చేసి ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి మొహం మెరిసేలా చేస్తుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel