Minister Roja: బుల్లితెరపై రోజూ రీఎంట్రీ, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందో తెలుసా?

Minister Roja: జబర్దస్త్ షో జడ్జిగా దాదాపు పదేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఎమ్మెల్యే రోజా మంత్రి పదవి రాగానే బుల్లితెరకు గుడ్ బై చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈటీవీ చేస్తున్న ఓ స్పెషల్ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. చీఫ్ గెస్టుగా మంత్రి రోజా మల్లీ రీఎంట్రీ ఇచ్చారు. యాంకర్ శ్రీముఖి ఈ షోను హోస్టే చేస్తోంది.

రోజా వచ్చీ రాగానే హైపర్ ఆది, రాం ప్రసాద్ లు తమదైన శైలిలో పంచ్ లు కురింపించారు. ఇక్కడున్న వారికి ఏ మంత్రి శాఖలు సెట్ అవుతాయని రోజాను అడగ్గా… ఒక్కొక్కరికి ఒక్కో శాఖ ఇచ్చింది. శ్రీముఖికి టూరింజం, ఆదికి ఆహార శాఖ ఇస్తానని చెప్పుకొచ్చింది. ఈ ప్రోమో చివర్లో రోజాకు అవమానం జరిగినట్లుగా చూపించారు. ఆమెకు సన్మానం చేస్తున్న సమయంలో నూకరాజు ఏదో ప్రశ్న అడిగితే రోజా హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

అసలు నన్ను పిలిచింది అవమానించడానికా అంటూ రోజా నూకరాజుపై సీరియస్ అయ్యారు. మీరందరూ ప్లాన్ చేసుకొని నన్ను రమ్మన్నారా.. అంటూ కంటతడి పెట్టుకొని రోజా వెళ్లిపోతున్న సమయంలో ప్రోమోను ఎండ్ చేశారు. అయితే టీఆర్పీ కోసం చేసిన స్టంట్ అని క్లియర్ గా తెలుస్తోందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel