Nagarjuna : ఎడిట్ వీడియోతో అడ్డంగా బుక్కయిన నాగార్జున… మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి నాగార్జున బలి!

Updated on: April 25, 2022

Nagarjuna : గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత ఏడాది సీజన్ 5 కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఈయన ఒక్కరికే సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, అలాగే తప్పు లేకపోయినప్పటికీ ఆ తప్పు గురించి పదేపదే ప్రస్తావిస్తూ వారిని తప్పనిసరి పరిస్థితులలో ఆ తప్పు ఒప్పుకొనేలా చేసి వారిని తిట్టడం చేశారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నాగార్జున పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హోస్ట్ గా నాగార్జున అన్ ఎలిజిబుల్ అంటూ ముద్ర కూడా వేశారు.షో మొత్తం చూడకుండా బిగ్ బాస్ నిర్వాహకులు ఏం స్క్రిప్ట్ రాస్తే అది వచ్చి నాగార్జున చదవడంతో పలుసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యారు.

Nagarjuna
Nagarjuna

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా నాగార్జున వ్యవహారశైలి ఇలాగే ఉంది.8వ వారం పూర్తి కావడంతో హౌస్ సభ్యులతో ముచ్చటించిన నాగార్జున గతవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిందుమాధవి అఖిల్ మధ్య జరిగిన గొడవ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎడిటింగ్ వీడియోతో నాగార్జున మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యారు. అఖిల్ బిందుమాధవి గొడవ పడుతూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒరిజినల్ వీడియోలో వీరిద్దరూ గొడవ పడిన అనంతరం నీకు అంతగా మాట్లాడాలి అనిపిస్తే రేపు నీకు ఓ డే ఇస్తాను పక్కన కూర్చొని మాట్లాడుదాం అంటూ అఖిల్ బిందుమాధవి తో అన్నారు. ఇదే ఒరిజినల్ వీడియో.

కానీ ఎడిటింగ్ వీడియోలో బిందు మాధవిని చూపిస్తూ పక్కకు రా అన్నది నువ్వే అంటూ బిందుమాధవిని బ్లేమ్ చేశారు. నువ్వే అన్నావు అంటూ తను తప్పు లేకపోయినా తన తప్పును ఒప్పించే ప్రయత్నం చేశారు.ఒరిజినల్ వీడియో గురించి నాగార్జునకు తెలియక పోయినా కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఈ షో చూడడం జరిగింది. ఇలా బిందుమాధవి తప్పు లేకపోయినా నాగార్జున తన తప్పును ఒప్పుకొనేలా చేశారు. ఈ క్రమంలోనే నెటిజన్లు మరోసారి నాగార్జునను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ అందుకే సారు షో చూడాలి అని చెప్పేది అంటూ పెద్ద ఎత్తున మరోసారి నాగార్జున గురించి ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Read Also :Naga Chaitanya : రెండో పెళ్లికి నాగచైతన్య రెడీ.. మళ్లీ హీరోయిన్‌తో ప్రేమలో..? అఖిల్ కోసం అమ్మాయిని వెతుకుతున్న నాగ్..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel