వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Kushi Movie : షూటింగులో ప్రమాదానికి గురైన సమంత విజయ్ దేవరకొండ… క్లారిటీ ఇచ్చిన ఖుషి టీమ్!

Kushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ సమంత ప్రమాదానికి గురయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ... Read more

By Ramesh Babu

Published on: May 24, 2022 10:30 AM

Updated on: May 24, 2022 11:23 AM

Kushi Movie

---Advertisement---

Kushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ సమంత ప్రమాదానికి గురయ్యారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా నదిలో వాహనం పడిపోయి వీరి వెన్నెముకకు గాయాలు అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

Kushi Movie
Kushi Movie

ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు.అయితే ప్రస్తుతం వీరు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వార్తలు రావడంతో ఈ వార్తలపై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అసలు విషయం వెల్లడించారు.ఖుషి సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ సమంతకు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఈయన ఫేక్ న్యూస్ అంటూ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విధంగా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ ప్రమాదం గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ సినిమా కాశ్మీర్ లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఎంతో విజయ వంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా తదుపరి షూటింగ్ వైజాగ్ తదితర ప్రాంతాలలో చిత్రీకరించాలని చిత్రబృందం భావిస్తున్నారు అయితే త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 23 వ తేదీ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించారు.

Read Also : Samantha Birthday : సమంత బర్త్‌డే ట్రీట్ అదిరిపోయిందిగా.. ఏకంగా షూటింగ్‌లోనే సామ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. వీడియో

, , , , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel