Akhil Akkineni : పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని అఖిల్ ఎవరంటే..?

Updated on: January 24, 2022

Akhil Akkineni : అక్కినేని కోడలుగా అడుగుపెట్టిన సమంత తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగానో సంపాదించుకుంది. కానీ ఆ తరువాత మనస్పర్థల తో ఇటీవలే విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. దీంతో మొన్నటి వరకు అఖిల్ కు మాత్రమే పెళ్ళి చేయాలనే బాధ్యత నాగార్జున పై ఉండేది.కానీ ఇప్పుడు నాగచైతన్య పెళ్లి బాధ్యత కూడా నాగార్జున భుజాలపై పడింది. అయితే గతంలో అఖిల్ పెళ్లి విషయంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఒక అమ్మాయిని ప్రేమించి,పెళ్లి చేసుకుంటానంటూ ఫ్యామిలీని ఒప్పించాడు అఖిల్.

నిశ్చితార్థం కూడా జరిగింది కానీ తర్వాత మనస్పర్ధలు రావడంతో, నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని పెళ్లి విషయాన్ని మరచిపోయారు. దీంతో ఇక ఇప్పుడు ఇద్దరు కొడుకుల పెళ్లి బాధ్యత నాగార్జున పై పడి పోయింది. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కొడుకులను ఒక ఇంటివాళ్ళని చేయాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడట. నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించినప్పటికీ,ఇప్పటి వరకు అఫీషియల్ డైవర్స్ రాకపోవడంతో ముందుగా చిన్న కొడుకు అఖిల్ కు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడట నాగార్జున. అంతేకాదు దీని కోసం ఒక బిగ్ ప్లాన్ కూడా సిద్ధం చేశారట.

ఇండస్ట్రీ తో సంబంధం ఉన్న సమంత ను కోడలిగా చేసుకోవడం వల్ల చివరకు నాగచైతన్య,సమంత విడిపోయారు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మాయిని అఖిల్ కోసం ఫైనల్ చేశాడట నాగార్జున. ఇక ఆ అమ్మాయికి పెద్దగా ఆస్తి లేక పోయినప్పటికీ ఇంటి కోడలిగా చేసుకునేందుకు మాత్రం నాగ్ రెడీ అయిపోయాడంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చైతన్య కు ఆఫీషియల్ గా విడాకులు వచ్చేంత వరకు ఆగి,ఆ తర్వాత చైతు పెళ్లి పై నోరు విప్పుతారట నాగార్జున. అఖిల్ కి పెళ్లి అనగానే ఆ అమ్మాయి ఎవరనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.

Advertisement

Read Also : Actress Samantha : నిజాలు మాట్లాడొద్దని ” సమంత ” కి ఆంక్షలు పెట్టింది వాళ్లేనా ?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel