Actress Swathi Sathish: సర్జరీ వికటించడంతో గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయిన నటి.. ఫోటో వైరల్!

Actress Swathi Sathish: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రెటీలు అందంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే అందాన్ని కాపాడుకోవడం కోసం వివిధ రకాల కాస్మటిక్ లను ఉపయోగించడమే కాకుండా, మరి కొంతమంది ఏకంగా సర్జరీలు చేయించుకుని తన అందాన్ని కాపాడుకుంటున్నారు. సర్జరీలు సక్సెస్ అయితే ఎలాంటి సమస్యలు లేవు కానీ ఈ సర్జరీలు కనుక విఫలం అయితే పూర్తిగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సర్జరీల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయిన సెలబ్రిటీలు ఉన్నారు.

ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు సర్జరీలు చేయించుకొని ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన స్వాతి సతీష్ సైతం ఇలాంటి సర్జరీ వికటించడంతో పూర్తిగా తన రూపురేఖలే మారిపోయాయి. స్వాతి ఇటీవల బెంగుళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో రూట్ కెనాల్ చేయించుకున్నారు. ఈ విధంగా రూట్ కెనాల్ థెరపీ వికటించడంతో ఆమె దవడ మొత్తం వాపు రావడమే కాకుండా తన రూపురేఖలు మొత్తం మారిపోయాయి. అయితే ఈ విషయం గురించి డాక్టర్లను సంప్రదించగా రెండు మూడు రోజులలో ఈ వాపు తగ్గుతుంది అని సూచించారు.

మూడు వారాలు అయినా తనకు వాపు తగ్గడమే కాకుండా అధికంగా నొప్పి ఉండటంతో నటి స్వాతి సతీష్ మరొక హాస్పిటల్ లో వైద్యులను సంప్రదించారు.ఈ క్రమంలోనే తన పరిస్థితి చూసిన డాక్టర్లు తనకు రూట్ కెనాల్ థెరపీ చేసే సమయంలో అనస్తీషియాకి బదులుగా సాలిసిలిక్‌ యాసిడ్‌ ఇచ్చినట్లుగా అక్కడి వైద్యులు తెలిపారు.ఇలా డాక్టర్ల తప్పిదం వల్ల తన రూపురేఖలు మొత్తం మారిపోయాయని తనకు ఈ నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత తనకు సర్జరీ చేసిన డాక్టర్లపై ఈమె కేసు వేయనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel