Actress Aishwarya : ఆ దర్శకుడిని కొడతామనుకున్నా.. చస్తాడని వదిలేసా.. నటి ఐశ్వర్య సంచలన కామెంట్స్

Actress Aishwarya : తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. వారిలో యాక్ట్రెస్ ఐశ్యర్య కొంచెం ప్రత్యే్కం.. సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్యర్య కెరీర్ మొదట్లో హీరోయిన్‌‌గా చేసింది. అయితే, ఆమె రఫ్ లుక్ కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని తెలిసింది. ఆ తర్వాత ఐశ్యర్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. తెలుగులో చాలా సినిమాల్లో ఐశ్యర్య నటించింది. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’.. ‘దేవదాసు’ వంటి సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించారు. ఐశ్వర్య ప్రస్తుతం తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసముంటున్నారు.

తెలుగులో నటి ‘ఐశ్యర్య’ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ‘ఓహ్ బేబీ’ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదా’గా కార్యక్రమంలో ఐశ్వర్య పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా యూట్యూబ్‌లో విడుదలైంది. ఆ షోలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రోమో ప్రారంభంలో వెల్కమ్ శాంతా మీనా అలియాస్ ఐశ్వర్య ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? అంటూ ఆలీ పలకరిస్తాడు. దీనికి ఐశ్వర్య ఫన్నీ ఆన్సర్ ఇస్తుంది.

మీ వారు ఏం చేస్తుంటారని అడుగగా.. మా వారు ఇంకో పెళ్లి చేసుకున్నారని.. వారికి ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టారు. మా కూతురుకి మేమంతా కలిసి పెళ్లి చేస్తున్నాం అంటూ చెప్పింది. తాను చాలా స్టేట్ ఫార్వర్డ్ అని చెప్పిన ఐశ్యర్య.. మీ సినిమా కెరీర్‌లో ఎంతమందిని కొట్టారని ఆలీ అడుగగా.. ఎవ్వరినీ కొట్టలేదని.. కానీ ఒక్కడిని మాత్రం కొట్టాలనిపించిందని తన మనసులో మాటలను చెప్పేసింది. కొడితే పాపం చచ్చిపోతాడని వదిలేసా.. అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అతను ఎవరు అని ఆలీ అడగగా.. ఒక డైరెక్టర్ అని వెల్లడించింది. అతను తన గురించి బ్యాడ్‌గా మాట్లాడాడని అప్పుడే కొట్టి ఉంటే బాగుండేదని మరోసారి గుర్తుచేసుకుంది.

Advertisement

Read Also : Rakul Preet Singh : సినిమా కోసం అలాంటి పనులు అస్సలే చేయను.. ఏదైనా సహజంగా జరగాలి!  

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel