...

Whatsapp New Feature : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ పొడిగించే అవకాశం… ఎంతసేపటికి అంటే ?

Whatsapp New Feature : ప్రస్తుత కాలంలోని ప్రతి ఒక్కరూ ఎక్కువగా వినియోగిస్తున్న యాప్ అంటే వాట్సాప్ అనే చెబుతారు. కాగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ కొత్త అప్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తోంది. అందులో వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ఒకటి. ఇప్పుడు ఈ ఫీచర్ టైమ్ లిమిట్ పొడిగించాలని వాట్సాప్ భావిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం కాల పరిమితిని పొడిగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత టైమ్ లిమిట్.. ఒక గంట, 8 నిమిషాలు 16 సెకన్లు ఉండగా.. త్వరలో వాట్సాప్ ఆ టైమ్ లిమిట్ కాస్తా రెండు రోజులకు పెంచే అవకాశం ఉంది. మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత యూజర్లు తమ మెసేజ్‌లను డిలీట్ చేసుకోవచ్చు. ప్రస్తుత టైమ్ లిమిట్ మెసేజ్‌ను పంపిన తర్వాత ఒక గంట, 8 నిమిషాలు, 16 సెకన్ల తర్వాత మాత్రమే ఆయా మెసేజ్ లను డిలీట్ చేసేందుకు యూజర్లకు వాట్సాప్ అనుమతిస్తుంది.

whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit
whatsapp-going-to-add-new-feature-about-messages-deleting-time-limit

వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ Wabetainfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ ‘Delete for Everyone’ టైమ్ లిమిట్.. ఒక గంట, ఎనిమిది నిమిషాలు, 16 సెకన్ల నుంచి రెండు రోజుల 12 గంటల వరకు పెంచాలని వాట్సాప్ భావిస్తోంది. వాట్సాప్ ఫీచర్‌ను విడుదల చేస్తే.. యూజర్లు తమ మెసేజ్‌లను పంపిన రెండు రోజుల తర్వాత కూడా చాట్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వాట్సాప్ టైమ్ లిమిట్ ను ఒక వారానికి పెంచాలని భావించింది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Read Also : Beet Root : బీట్ రూట్… మీ అందానికి , ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!