Flipkart Offers : కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఇస్తున్న ‘ఫ్లిప్‌కార్ట్ ‘… టీవీలపై 70% ఆఫర్!

Updated on: February 4, 2022

Flipkart Offers : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బ‌చ‌త్ ధ‌మాల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ గురువారం ప్రారంభం కాగా ఈ నెల 5వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీల‌పై 70 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌ను ఈ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ సేల్‌లో భాగంగా టీవీల ప్రారంభ ధ‌ర రూ.7,999గా ఉంది. బ్లౌపంక్ట్‌, కొడాక్‌, థామ్స‌న్ టీవీల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది.

సేల్‌లో భాగంగా 32 ఇంచుల బ్లౌ పంక్ట్ సైబ‌ర్ సౌండ్ టీవీ ధ‌ర రూ.13,499 ఉంది. 42 ఇంచుల టీవీని రూ.20,999 ధ‌ర‌కు, 43 ఇంచుల 4కె టీవీని రూ.28,990కి, 50 ఇంచుల 4కె టీవీని రూ.34,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వచ్చు. ఈ సేల్‌లో కొడాక్‌కు చెందిన 24 ఇంచుల టీవీ ధ‌ర రూ.7,999 ఉండ‌గా, 32 ఇంచుల టీవీ ధ‌ర రూ.12,499, 40 ఇంచుల టీవీ ధ‌ర రూ.18,499, 42 ఇంచుల టీవీ ధ‌ర రూ.20,499గా ఉంది.

flipkart-giving-70-offer-on-tvs-and-products-details
flipkart-giving-70-offer-on-tvs-and-products-details

అలాగే 50 ఇంచుల టీవీని రూ.29,999కు, 65 ఇంచుల టీవీని రూ.53,999 ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు. థామ్స‌న్ టీవీలు అయితే 32, 43, 50, 65, 75 ఇంచుల టీవీల ధ‌ర‌లు వ‌రుస‌గా.. రూ.9,999, రూ.26,999, రూ.30,999, రూ.53,999, రూ.99,999గా ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌తో టీవీల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈజీ రిట‌ర్న్స్ స‌దుపాయం కూడా ల‌భిస్తోంది.

Advertisement

Read Also : Crime News : కట్టుకున్న భార్యని కడతేర్చిన కిరాతకుడు… షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి !

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel