...

Crime News : కట్టుకున్న భార్యని కడతేర్చిన కిరాతకుడు… షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి !

Crime News : మారుతున్న కాల క్రమేనా మహిళలపై అఘాయిత్యలు పెరుగుతున్నాయి తప్ప… తగ్గడం లేదు. తల్లి, చెల్లి, అక్క, భార్య అనే తేడా లేకుండా అందరిపై దాడి జరిగిన ఘటనలు కోకొల్లలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యని ఆమె భర్త పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోడిమెరక గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

వివాహిత కనిపించకపోవడంతో వారం క్రితం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె భర్త కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు… దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఈ దర్యాప్తులో వారికి మరికొన్ని షాకింగ్‌ విషయాలు వెలుగు లోకి వచ్చాయి. దర్యాప్తు అనంతరం నాగరాజు తన భార్యని హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. గాలింపు చర్యల అనంతరం పరారీలో నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

husband-killed-his-wife-in-vizianagaram-district
husband-killed-his-wife-in-vizianagaram-district

కాగా బాధితురాలిని ఆమె భర్త పెట్రోల్‌ పోసి చంపాడని తేలింది. ఈ క్రమంలో బాధితురాలు లక్ష్మీ మృతదేహాన్ని ఏపీ మోడల్ స్కూల్ వద్ద పోలీసులు గుర్తించారు. ఆమెను చంపిన తర్వాత మృతదేహాన్ని గుర్తు పట్టకుండా పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా నిందితుడుని కఠినంగా శిక్షించాలని కొత్తవలసలో మహిళల ధర్నా నిర్వహిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్థానిక మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు.

Read Also : MLA Nandamuri Balakrishna : హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలన్న బాలయ్య… అవసరమైతే రాజీనామా !