WHATSAPP NEW FEATURE: వాట్సాప్ లో మూడు టిక్కులు ఆప్షన్​..!

WHATSAPP NEW FEATURE: త్వరలోనే ప్రముఖ సామాజిక మాధ్యమం అయన వాట్సాప్​ లో మూడు టిక్కులు సదుపాయం రానుందనే వార్త ఓ రేంజ్​ లోవైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెటింట్లో బాగా కనిపిస్తున్నాయి. మనం మెసేజ్​ పంపిన వ్యక్తి మన మెసేజ్​లను కానీ, ప్రైవేట్​ వీడియోలను కానీ, ఇతర ఫొటోలను స్క్రీన్​ షాట్​ తీస్తే ఈ మూడో టిక్ మనకు చెప్పేస్తుందని అనే న్యూస్ బాగా వినిపిస్తుంది. దీనిని వాట్సాప్ ప్రస్తుతం పరీక్షిస్తుందని మరి కొద్ది రోజుల్లోనే ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ మాటల్లో నిజం లేదని కొందరు వాదిస్తున్నారు.

WHATSAPP NEW FEATURE WHATSAPP IS NOT GETTING A THIRD BLUE TICK TO DETECT SCREENSHOTS
WHATSAPP NEW FEATURE WHATSAPP IS NOT GETTING A THIRD BLUE TICK TO DETECT SCREENSHOTS

ఓ రేంజ్​ లో వైరల్ అయిన ఈ న్యూస్​ పై వెబ్ బీటా ఇన్ఫో స్పందించింది. ఈ వార్తలను కొట్టి పారేసింది. అలాంటి ఫీచర్​ అనేది ఏం లేదని తేల్చి చెప్పింది. ఈ వార్తలను పెద్దగా నమ్మవద్దని పేర్కొంది. ఇది కేవలం పుకారు మాత్రమే అని స్పష్టం చేసింది. ఇలాంటి వివరాలు ఏమైనా ఉంటే కచ్చితంగా వాట్సాప్ వినియోగదారులకు తెలియజేస్తుందని వివరించింది వెబ్​ బీటా ఇన్ఫో .

నార్మల్ గా అయితే టిక్ లకు సంబంధించిన మ్యాటర్ అందరికీ తెలుసు. మనం మెసేజ్ చేసినప్పుడు ఆ మెసేజ్ డెలివరీ కాకపోతే కేవలం ఒక బూడిద రంగు టిక్ కనిపిస్తుంది. అదే డెలివరీ అయితే రెండు బూడిద రంగు టిక్​లు కనిపిస్తాయి. ఓ వేళ మనం పంపిన వ్యక్తి చూస్తే మాత్రం రెండు బ్లూ టిక్కులు కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ గురించి అందరికీ తెలుసు. కానీ మన ప్రైవేట్ చాట్​ ను స్క్రీన్ షాట్ తీస్తే మూడో టిక్ వచ్చేది మాత్రం పక్కా ఫేక్ న్యూస్ అని అర్థం అవుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel