Google play store: ప్రస్తుతం మనుమున్న జనరేషన్ లో మొబైల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఫోన్ చేతిలో ఉంది అంటే ఇంకేం అవసరం లేదన్నట్టుగా మారిపోయింది. ఏదైనా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే అది హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మితి మీరిన వినియోగం కూడా ఒక్కోసారి చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా ఈరోజుల్లో అంతా డిజిటల్ ప్రపంచంగా మారిపోయింది. క్యాష్ లెస్ ట్రాన్ సాక్షన్స్ కే యువత మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల అవినీతి జరగదని, నకిలీ కరెన్సీని అదుపులో పెట్టొచ్చని కేంద్ర ప్రభుత్వం భావించినా, ఇప్పుడు ఆన్ లైన్ మోసాలతో సైబర్ నేరగాళ్లు డేటాను తస్కరించి, మరింత నష్టాన్ని కలిగిస్తున్నారు.
అయితే వీటన్నిటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు, జాగ్రత్తలూ తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం గానే కనిపిస్తోంది. కాగా ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టడానికి గూగుల్ ప్లే స్టోర్ నడుం బిగించింది. ఈ రోజుల్లో సగం పనులు ఫోనుల్లోనే జరిగి పోతున్నాయి. కానీ ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ తప్పనిసరి. అందుకు అనుకూలంగా ఉండేందుకే గూగుల్ వాటిని ఆప్స్ రూపంలో సేవలు అందిస్తోంది. అయితే వీటిని వాడే ముందు మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ హెచ్చరిస్తోంది. ఆప్స్ లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తోంది.
అయితే ఇంతకు మునుపు ఈ అప్ డేట్ అనేది ఉన్నా కూడా నచ్చిన వాళ్ళు చేసుకునే వారు. ఇలా కొంత మంది మాత్రం అప్ డేట్ చేయకుండా అలానే ఆప్స్ ను వాడడం వలన డేటాకు సంబంధించి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తాజాగా గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్ టార్గెట్ లెవల్ ఏపీఐ ప్రమాణాల ప్రకారం విడుదలైన ఏడాదిలోపు అప్‌డేట్ ఇవ్వని యాప్‌లను ఇక నుంచి యూజర్ల డౌన్‌లోడ్ చేసుకోలేరని వెల్లడించింది. అంతే కాకుండా ఈ నిబంధనలు నవంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా గూగుల్ తన డెవలప్ కమ్యూనిటీ బ్లాక్‌లో పొందు పరిచింది. ఇదే కాదు ఇక నుంచి గూగుల్ ప్లేస్టోర్‌లోకి వచ్చే ప్రతి యాప్, ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ అయినా సరే ఏడాదిలోపు అప్‌డేట్ ఇవ్వకుంటే ఆ ఆప్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉండదని కూడా గూగుల్ స్పష్టం చేసింది.