AP News: జగనన్న కాలనీలో పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా… అయితే మీకిది శుభవార్తే!

AP News: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన తన మేనిఫెస్టోలో నవరత్నాలు గురించి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నవరత్నాలలో భాగంగా పక్కా ఇంటి నిర్మాణాన్ని చేపడతామని జగన్ ప్రకటించారు.ఈ క్రమంలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఆ ఇంటి మహిళా పేరు పైన స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే జగనన్న కాలనీలలో భాగంగా జగనన్న ప్రభుత్వం 350 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టేందుకు రూ.1.80 లక్షల రుణాన్ని ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. అయితే పెద్దగా ఇంటిని నిర్మించుకోవాలని భావించే వారికి ఈ డబ్బుతో ఇంటి నిర్మాణం పూర్తి కాక అధిక వడ్డీలకు ఇతరుల నుంచి డబ్బును అప్పుగా తీసుకుని ఇంటి నిర్మాణ పనులను చేపడుతున్నారు.అయితే ఇలా ఇల్లు పెద్దగా కట్టుకోవాలి అనుకునే వారికి జగన్ ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది.

ఇకపై జగనన్న కాలనీలలో పెద్దగా ఇంటిను నిర్మించుకోవాలి అనుకునేవారికి మూడు లక్షల రూపాయల వరకు బ్యాంకులు రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అత్యంత తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని మంత్రి రంగనాథ రాజు వెల్లడించారు.ఈ క్రమంలోనే జాతీయ బ్యాంకులు లబ్ధిదారునికి అవసరాన్ని బట్టి లక్ష నుంచి 3 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ విధంగా బ్యాంకు నుంచి రుణం పొందిన వారు 5 ,8, 10 సంవత్సరాలలోపు వడ్డీతో సహా వారు తీసుకున్న అప్పును విడతలవారీగా చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. ఇక జగన్ ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కూడా కల్పించడంతో ఇతరుల వద్ద అధిక వడ్డీ తీసుకొని ఇబ్బందులు పడాల్సిన పనిలేకుండా అత్యంత తక్కువ వడ్డీతోనే అందమైన కళల ఇంటినీ నిర్మించుకోవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel