CM KCR: పంజాబ్ తరహాలో రైతు ఉద్యమానికి పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్!

Updated on: March 22, 2022

CM KCR: పంజాబ్లో రైతు చట్టాల కోసం రైతులు పెద్దఎత్తున దీక్షలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ప్రభుత్వం ఈ దీక్షను విరమించేలా చేయడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రైతులు మాత్రం పట్టు విడవకుండా దీక్షలు చేశారు. ఈ క్రమంలోనే పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రైతులు ఉద్యమాలకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు సీఎం కెసిఆర్ వెల్లడించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమం కొనసాగాలని ఈనెల 24,25 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ధర్నాలో భాగంగా వారితో పాటు ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేయనున్నారు. రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో పోరాడుతుందని కేసీఆర్ వెల్లడించారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫుడ్ బిల్ తీసుకురావాలని.. ఈ మేరకు పెద్ద ఎత్తున భారీ ఉద్యమం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై అంశాలవారీగా పార్లమెంట్‌లో ఎంపీలు మాట్లాడాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడించారు.

ఇకపోతే కాశ్మీర్ లో 30 సంవత్సరాల క్రితం పండ్ల పై జరిగిన అవమానాలను, వారికి పెట్టిన చిత్రహింసల గురించి ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై కేసీఆర్ మండిపడ్డారు కాశ్మీర్ పండిట్ల పై అవమానం జరుగుతున్న సమయంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో లేదా..అంటూ ప్రశ్నించారు.కేవలం ఈ సమస్యలన్నింటిని పక్కదారి పట్టించడం కోసమే బిజెపి ప్రభుత్వం ఈ సినిమాని తెరపైకి తీసుకు వచ్చిందని కెసిఆర్ బిజెపి ప్రభుత్వం ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel