కొత్త సంవత్సరంలో యాపిల్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే వారి కోసం తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ యాపిల్ ప్రొడక్ట్స్ పై తన కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ల ద్వారా కేఎంబీఎల్ డెబిట్,క్రెడిట్ కార్డుదారులు ఐఫోన్లు, ఐపాడ్లు,మ్యాక్ బుక్స్,యాపిల్ వాచ్ లు, ఎయిర్ పాడ్స్,హోమ్ పాడ్స్ పై పదివేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంతేకాదు యాపిల్ ప్రొడక్ట్స్ పై ఈఎంఐ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. గత గురువారం నాడు కోటక్ మహీంద్రా బ్యాంకు యాపిల్ ప్రొడక్ట్స్ పై క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్స్ ప్రకటించింది.
దీంతో ఆ బ్యాంకు క్రెడిట్,డెబిట్ హోల్డర్లు ఈఎంఐ /నాన్ ఈఎంఐ లావాదేవీలు ఉపయోగించి ఐఫోన్లు,ఐపాడ్లు, మ్యాక్ బుక్స్,యాపిల్ వాచ్ లు,ఎయిర్ పాడ్స్,హోమ్ పాడ్స్ పై పదివేల వరకు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఐఫోన్ 13 మినీ ఫోన్స్ పై కేఎంబీఎల్ కార్డు హోల్డర్లు ఆరువేల క్యాష్బ్యాక్ లేదా ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ దక్కించుకోవచ్చు. ఐఫోన్13 ప్రో,ఐఫోన్ 13 ప్రో మాక్స్,ఐఫోన్12 ఫోన్స్ పై 5 వేల క్యాష్ బ్యాక్ పొందవచ్చు.న్యూ మాక్ బుక్ ప్రో పై గరిష్టంగా 10 వేల క్యాష్బ్యాక్ అందిస్తోంది. ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆఫర్లు ఎలా ఉన్నాయంటే..?
ఎయిర్ పాడ్స్ పై 1,000నుండి 2,500 వరకు ఆఫర్లు పొందొచ్చు. అలాగే యాపిల్ స్మార్ట్ వాచ్ లపై వెయ్యి నుంచి మూడు వేల వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ లను బ్యాంకు తీసుకొచ్చింది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లు ఆఫ్లైన్,ఆన్ లైన్ ఛానల్ లలో ఫుల్ కార్డ్ స్వైఫ్ లు.. కార్డు ఈఎంఐ లలోనూ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయని కోటక్ బ్యాంకు తెలిపింది. యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ స్టోర్స్, అమెజాన్, టాటాక్లిక్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్ నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఈ ఆఫర్ లు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి.