Credit Card Offers : క్రెడిట్ కార్డ్ లపై సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్‌లు.. ఎంతంటే..?

Updated on: August 4, 2025

Credit Card Offers : ప్రస్తుతం క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆన్లైన్ షాపింగ్స్, ఈ షాపింగ్ మాల్స్ అలాగే రకరకాల వాటికి క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డులు అవసరానికి ఆదుకుంటాయి. అయితే క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడితే మంచిది లేకపోతే అధిక పెనాల్టీలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కొన్ని క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్లు ఉంటాయి. షాపింగ్,ఇతర వాటికి క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కూడా ఇస్తుంటాయి. అయితే పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై ఇస్తున్న ఆఫర్లు ఇవే..

what-are-the-latest-cash-back-offers-on-credit-cards
what-are-the-latest-cash-back-offers-on-credit-cards

యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ పై ఆఫర్లు ఉన్నాయి. గూగుల్ పే ద్వారా చేసే యుటిలిటీ బిల్లు మొత్తంపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అంతేకాకుండా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గి,ఓలా వంటి వాటిపై కూడా నాలుగు శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది.అలాగే ఇతర చెల్లింపులపై కూడా రెండు శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ కార్డు పై వార్షిక రుసుము రూ.499 ఉంది. మన దేశంలో నాలుగు వందలకు పైగా రెస్టారెంట్లలో 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అలాగే విమాన ప్రయాణాలలో కూడా 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్ డిఫ్ సీ రెగాలియా క్రెడిట్ కార్డ్ కూడా ఆఫర్లు అందిస్తుంది. లావాదేవీలపై రూ.150 చెల్లింపులపై 4 రివార్డు పాయింట్లను అందిస్తోంది. అంతేకాకుండా విమాన ప్రయాణం, విద్య, ఇంటి అద్దె, రెస్టారెంట్లు ఇతర కొనుగోళ్లపై డిస్కౌంట్, రివార్డు పాయింట్లను కూడా అందిస్తోంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రయోజనాలు ఉన్నాయి.

హెచ్ డిఫ్ సీ డినర్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డు పై కూడా ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, బిగ్ బాస్కెట్, టైమ్స్, జొమాటో వంటివాటికి ఏడాది సభ్యత్వాన్ని అందిస్తోంది. వారాంతపు డైనింగ్ లో 2ఎక్స్ రివార్డులను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యికిపైగా లాంజ్ లలో పన్నెండు సార్లు ఎయిర్ పోర్ట్ లాంచ్ యాక్సెస్ సదుపాయం అందిస్తోంది. రూ. 400 కనీస లావాదేవీపై ఒక శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు ఉంది. ఎస్బిఐ కార్డు ఎలైట్ పై ఆఫర్లను అందిస్తోంది. యాత్ర, పాంటలూన్స్, బాటా, షాపర్స్ స్టాప్ వంటివాటిపై ఐదు వేల రూపాయల వరకు గిఫ్ట్ వోచర్ లను అందిస్తుంది. కాంప్లిమెంటరీ ట్రైడెంట్ ప్రివిలేజ్ మెంబర్షిప్, క్లబ్ విస్తారా నెంబర్ షిప్ కూడా లభించే అవకాశం దక్కించుకోవచ్చు.

Advertisement

Read Also : Credit card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? మినియం బిల్ చెల్లించినట్లైతే ఇది తెలుసుకోకుంటే మీ జేబుకు బొక్కే

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel