...

Teenmar Mallanna: ఆరు నెలలు కూడా గడవకముందే బీజేపీకి గుడ్ బై చెప్పిన తీన్మార్ మల్లన్న.. త్వరలో కొత్త పార్టీ!

Teenmar Mallanna: సాధారణంగా రాజకీయాలలో క్షణాలలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఒక పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తారో తెలియదు. ఈ క్రమంలోనే ఆ పార్టీ వ్యవహారశైలి నచ్చక పోయినా పార్టీ అధికారుల నుంచి అధిక ఒత్తిడి తలెత్తిన వెంటనే ఆ పార్టీకి స్వస్తి చెబుతూ ప్రతిపక్ష పార్టీలో చేరుతూ ఉంటారు. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి కారుతో కలిసి ప్రయాణం చేసిన ప్రముఖ జర్నలిస్టు, యాక్టివిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గత ఏడాది సెప్టెంబర్ నెలలో కారు నుంచి దిగి గులాబీ హక్కున చేరారు.

ఈ విధంగా బీజేపీలో చేరి ఆరు నెలలు కూడా గడవకముందే కమలానికి స్వస్తి పలుకుతూ సొంత పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన అనుచరులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసిన తీన్మార్ మల్లన్న ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దొంగల సంఖ్య 7200. రాష్ట్ర సంపదను ఈ దొంగలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆ 7200 దొంగల భరతం పడతానని ఈయన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములలో తీన్మార్‌ మల్లన్న టీం-7200 ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దొంగల కన్నా బిజెపి పార్టీ ఎన్నో రెట్లు మేలని, అయితే తాను ఇకపై బిజెపి పార్టీలో ఉండనని తీన్మార్ మల్లన్న వెల్లడించారు. త్వరలోనే తాను కూడా ఒక సొంత పార్టీని స్థాపిస్తానని,తన కుటుంబం పై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసి ఇచ్చి ప్రజల్లోకి వెళ్లి కొత్త పార్టీని ప్రారంభిస్తానని ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరైతే వైద్య ,విద్యకు దూరంగా ఉన్నారో అలాంటివారు మద్దతు తీసుకుని ప్రజలలోకి వచ్చి ప్రజల సమస్యలకు పరిష్కారం తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.