Election Results 2022 : యూపీ, ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీజేపీ, పంజాబ్‌లో ఆప్ పార్టీ, కాంగ్రెస్‌కు మధ్య గట్టి పోటీ ఎదురవుతోంది. పంజాబ్‌లో ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోనూ జోరుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మణిపూర్‌లోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీనే ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీలో ఏ పార్టీ గెలుస్తుందనే ఆసక్తి నెలకొంది. ఓటర్లు ఏ పార్టీని అధికారంలో తీసుకొస్తారనే ఉత్కంఠ నెలకొంది. ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూపీ అధికార పీఠం ఎవరిదో తేల్చనుంది. ఇప్పటికే అన్ని సర్వే సంస్థలు బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఈ రోజుతో తేలిపోనుంది. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మార్చి 7న ఏడో రౌండ్ పోలింగ్‌తో పోలింగ్ ముగిసింది. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 స్థానాలకు ఎన్నికల జరిగాయి.
ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రానున్నాయి. యూపీలో 202, గోవాలో 21, ఉత్తరాఖండ్‌లో 36, మణిపూర్‌లో 31, పంజాబ్‌లో 59గా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఆ ఐదు రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల బీజేపీనే ఉంది. యూపీలో మళ్లీ యోగికే ప్రజలు పట్టం కట్టనున్నారా? అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల నేడు భవితవ్యం తేలనుంది.
Read Also : Horoscope Today 10 March 2022 : ఈ రోజు ఈ రాశివారికి గడ్డుకాలమే.. ఏయే రాశులతో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే?