TDP-Janasena : ఉమ్మడి రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ప్రస్తుతం చాలా బలహీనంగా తయారైంది. 2019 ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవి చూసింది. మరి రాష్ట్రంలో ఇప్పటికే ఫామ్‌లో ఉండి, అధికారంలో కొనసాగుతున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా అంటే చెప్పలేం. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపాలంటే టీడీపీ వంద సీట్లు సాధించాలి.
కానీ ఇది ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధ్యమవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఒకవైపు వైసీపీ మీద ప్రజలకు కాస్త నమ్మకం తగ్గుతోంది. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని టీడీపీ ఇప్పటి నుంచి ముందుకెళ్లాలి. దీనికి తోడు ఏయే ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉంది. ఏ ప్రాంతాల్లో చాలా కష్టపడాలి అనే లెక్కలు వేసుకుంటోంది టీడీపీ. దీనికి తోడు జనసేనతో కలిసి పనిచేస్తే వైసీపీని కట్టడి చేయవచ్చని భావిస్తోంది.
టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన ఒప్పుకుంటుందా అంటే అదీ చెప్పలేము. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు కొనసాగింది. కానీ ఇందులో జనసేనకు కేవలం నామమాత్రంగానే సీట్లు కేటాయించింది టీడీపీ. అధికారం చేపట్టిన తర్వాత జనసేన పార్టీని పట్టించుకోలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో పవన్.. టీడీపీతో జత కడతారా అనేది తెలియాలి. కానీ జనసైనికులు మాత్రం కాస్త భిన్నంగానే ఆలోచిస్తున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దుతు ఇచ్చామని, గెలిచిన తర్వాత తెలుగు దేశం పార్టీ తమను పట్టించుకోలేదన్న భావనలో ఉన్నారు. ఈ సారి టీడీపీతో జత కడితే తమకేంటి లాభమని ఆలోచిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ వైఖరి నచ్చకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాయమని చెబుతున్నారు జనసైనికులు. మరి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఒక వేళ విజయం సాధిస్తే ఎలాగో చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. మరి పవన్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వారి మదిలో మెదులుతున్నాయి.
Read Also : Jana Reddy Sons : ఆ అన్నదమ్ముళ్లకు ఈసారి టికెట్స్ దక్కుతాయా..? నెక్ట్స్ ఎలక్షన్స్‌లో ఏం జరగబోతోంది?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world