...

Jana Reddy Sons : ఆ అన్నదమ్ముళ్లకు ఈసారి టికెట్స్ దక్కుతాయా..? నెక్ట్స్ ఎలక్షన్స్‌లో ఏం జరగబోతోంది?

Jana Reddy Sons : జానారెడ్డి… ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రం నుంచి తన మార్క్‌ను చూపిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో, వైఎస్సార్ హయాంలో ఆయన ఎన్నో మంత్రి పదవులు అనుభవించారు. ఇక ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం తన కుమారుల పొలిటికల్ కెరీర్ పైనే ఉంది. ఇక వారిద్దరిని దారిలో పెట్టి ఆయన రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు. నాగార్జున సాగర్ ఆయనకు కంచుకోట కానీ ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాయని వెల్లడించారు.

అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తన పెద్ద కుమారుడు రఘువీర్‌ను నిలబెట్టాలని చూశారు. కానీ హైకమాండ్ మాత్రం జానారెడ్డినే నిలబెట్టాలని డిసైడ్ అయింది. దీంతో తండ్రి తరపున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక రఘువీర్‌కు సైతం రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి సైతం టికెట్ పొందే ఆలోచనలో ఉన్నారు జానా కుమారులు. ఇందులో భాగంగానే నాగార్జున సాగర్ లో జానా చిన్న కొడుకు జైవీర్, మిర్యాలగూడలో రఘువీర్ ముమ్మరంగా పర్యటనలు చేస్తున్నారు. టికెట్ కోసం కిందిస్థాయి నేతలను సైతం కలుపుకు పోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఒక వేళ జానారెడ్డి పోటీ చేయకపోతే తన ఇద్దరు కుమారులకు టికెట్లు ఇప్పిస్తారా? లేక పార్టీ అధిష్ఠానం ఒకే టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జునసాగర్, మిర్యాలగూడ రెండు కూడా జనరల్ స్థానాలే. బలమైన అభ్యర్థుల కోసం పార్టీ నిర్ణయం తీసుకుంటే జానా కుమారులకు టికెట్టు దక్కే చాన్స్ ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈక్వేషన్ తీసుకుంటే సమస్య వచ్చే చాన్స్ ఉంది. 2018లోనూ బీసీ అభ్యర్థి అయిన ఆర్. కృష్ణయ్య ను బరిలో నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also : Chiranjeevi Tulasi : మెగాస్టార్ చిరంజీవిని ఎండలో నిలబెట్టిన ప్రొడ్యూసర్.. అసలు విషయం బయటపెట్టిన తులసి..