Nara Lokesh : వచ్చే వారంలో జగన్ అవినీతి కుంభకోణం బయటపెడతా… లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వర్గాలు ప్రతిపక్ష పార్టీ వర్గాల మధ్య తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి విమర్శలు చేశారు. వచ్చే వారంలో జగన్ మోహన్ రెడ్డి కి సంబందించిన అతి పెద్ద కుంభకోణం బయటపెడతానని వెల్లడించారు. ఈ క్రమంలో నారా లోకేష్ మాట్లాడుతు..జగన్ మోహన్ రెడ్డివి అన్ని పదో తరగతి పాస్-డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు అంటూ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి తెలివితేటల వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

nara-lokesh-jagans-corruption-scandal-will-be-revealed-next-week-lokeshs-sensational-comments
nara-lokesh-jagans-corruption-scandal-will-be-revealed-next-week-lokeshs-sensational-comments

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే బయటకు వెళ్లిన పరిశ్రమలే ఎక్కువని విమర్శించాడు. ప్రస్తుతం కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా సీఎంకు వాటా ఎంత అనే చర్చ వస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్ సవాలు చేశారు. జగన్ టైం అయిపోయింది. అతను ఇంటికెళ్లే సమయం దగ్గర పడిందని లోకేష్ వెల్లడించారు. వచ్చే వారంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అతిపెద్ద కుంభకోణం బయట పెడతానని ఈ సందర్భంగా లోకేష్ వెల్లడించాడు.

 

Nara Lokesh:

ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన దాదాపు హామీల్లో మాట తప్పిన జగన్మోహన్ రెడ్డిని 175 నియోజకవర్గాలు గెలిపించటం అవసరమా అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో మెడలు వంచుతానని చెప్పిన జగన్.. రాష్ట్రానికి ఏం సాధించారు అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. అయితే గతంలో మహానాడు జరిగిన సమయంలో కూడా పెద్ద కుంభకోణం బటయపెడతానని నారా లోకేష్ వెల్లడించారు.ఇటీవల వచ్చే వారంలోనే కుంభకోణం బయటపెడాతనని నారాలోకేష్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

Read Also :  Jr NTR Nara Lokesh : లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు..! జూనియరే కావాలట..!