YS Jagan : గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలని ఇళ్ల కార్యాక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. చేసిన పనులకు నిదులు కూడా సక్రమంగా విడుదల చేస్తున్నామన్న సీఎం… బిల్లలు వేగంగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలనున్నారు.
విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలలని సీఎం సూచించగా… అక్కడ 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. ఆప్షన్ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలూ కూడా వేగంగా సాగుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు… కాలనీల్లో సమాంతరంగా మౌళిక సదుపాయలా క్లపనా పనులపై దృష్టి పెట్టని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకించి ఒక ఫోన్ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు.
Read Also : Napping : తరచూ నిద్రపోవడం వల్ల స్ట్రోక్, హైబీపీ వస్తాయట.. జాగ్రత్త సుమీ!