AP Three Capitals : మోదీ లాగే జగన్ కూడా దిగిరాక తప్పదా? 

Updated on: August 4, 2025

AP Three Capitals : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తాను తీసుకొచ్చిన సాగు చట్టాలను ఎట్టకేలకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సాగు చట్టాల బిల్లులను రద్దు చేస్తామని స్వయంగా ప్రధాని ప్రకటించడం విశేషం. వచ్చే నాలుగుదైదు నెలల్లో ఉన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రభుత్వం వెనక్కు తగ్గిందని కొంత మంది ఆరోపణలు చేస్తున్నా సాగు చట్టాల రద్దుతో రైతులకు మాత్రం న్యాయం జరిగింది. గత 9 నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాలకు ఫలితం లభించినట్లయింది. సాగు చట్టాల రద్దుతో రైతుల్లో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ తాను తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పదని పలువురు భావిస్తున్నారు. 3 రాజధానుల రద్దు కోసం రైతులు, ప్రజలు గత 700 రోజులుగా మొక్కవోని ధైర్యంతో అనేక దీక్షలు నిరసనలు చేస్తూ వస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం ఇప్పటికీ వెనక్కు తగ్గడం లేదు. పైగా రైతులను పెయిడ్ ఆర్టిస్టులని పలువురు వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎన్ని విధాలుగా వైసీపీ నాయకులు ఆరోపణలు చేసినా గానీ వెనక్కు తగ్గేది లేదని రైతులు ప్రకటించారు.

వారు త్వరలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరుతో మహా పాదయాత్రను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో వైసీపీ కూడా వెనక్కు తగ్గి 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటుందని జోరుగా చర్చ నడుస్తోంది. మరి కేంద్రంలో మోదీలా వైఎస్ జగన్ కూడా అడుగు వెనక్కేసి తాను తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటారా? లేదా తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also : RGV Comments : చంద్రబాబు ఏడ్చిన ఘటనపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel