...

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సు.. కాన్వాయ్ ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు..!

CM Jagan : ఏపీ సీఎం జగన్ గొప్ప మనస్సును చాటుకున్నారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎదురుచొచ్చిన అంబులెన్స్ కు దారిచ్చి మంచి మనస్సును చాటుకున్నారు. ఏపీ ప్రజలందరికి సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా మధ్యలో 108 వాహనం వచ్చింది. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అదే సమయంలో గన్నవరం నుంచి విజయవాడ వైపు 108 వాహనం వచ్చింది.

Advertisement

అంతే.. అంబులెన్స్‌ సైరన్‌ను వినగానే సీఎం జగన్.. అంబులెన్స్‌ కు దారి ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాంతో అధికారులు ముందుగా కాన్వాయ్ ను ఆపేసి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఇలాంటి అత్యవసర సమయాల్లో ఆదేశాల కోసం ఎదురుచూడొద్దని అధికారులకు జగన్ సూచించారు. అంబులెన్స్ వెళ్లిన అనంతరం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు.

Advertisement

Read Also : Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ట్వీట్ వైరల్!

Advertisement
Advertisement