...

Amit Shah : నిజంగానే బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా..?

Amit Shah : ఏపీలో బీజేపీని ఎలాగైనా బలమైన పార్టీగా మార్చేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏపీలో బీజేపీ పుంజుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మండలిలో సైతం కేవలం ఒక్కరే ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ పార్టీలకు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది.

కానీ, తాజాగా జరిగిన బద్వెల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసుకుని మురిసిపోతున్నది బీజేపీ. వచ్చే ఎన్నికల సరికి ఇతర పార్టీలకు గట్టిపోటీ ఇచ్చేలా బీజేపీని తయారు చేయాలని భావిస్తున్నారు పెద్దలు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేదు. దీని వల్ల టీడీపీకి చెందిన ఓట్లు దాదాపుకు బీజేపీకి పడిపోయాయి.

ఇదిలా ఉండగా ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని సొంతంగా నిలబెట్టుకోవడానికి కృషి చేయాలంటూ చెప్పుకొచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీని బలంగా ఎదుర్కోవాలని, ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకురావాలని సూచించినట్టు టాక్. అయితే.. ఇప్పటికే బీజేపీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోనూ పార్టీ కొంత కొంతగా క్రేజ్ ను కోల్పోతుంది.

ఇలాంటి సమయంలో ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి చేర్చడమంటే గగనమనే చెప్పాలి. అసలే విభజన హామీలు అమలు చేయలనే డిమాండ్లు ఓ వైపు నుంచి వినిపిస్తున్నాయి. మరో వైపు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశం సైతం ఇంకా చల్లారలేదు. ఇన్ని సమస్యలను ఎదురుగా పెట్టుకుని బీజేపీ ఎలా గట్టిపోటీ ఇవ్వగలదనే ప్రశ్నను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Revanth Reddy : కాంగ్రెస్ నుంచి సీఎంగా రేవంత్ బరిలోకి దిగితే.. మరి కమలం నుంచి ఎవరుంటారో..?