Chinmay sripada: పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయ్ శ్రీపాద..!

Singer chinmay sripada blessed with twins
Singer chinmay sripada blessed with twins

Chinmay sripada: సింగర్ చిన్మయి శ్రీపాద మంగళ వారం పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశారు. అయితే పిల్లల చేతులు, వారి చేతులను ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇద్దరి పిల్లలో ఒకరికి ద్పిర్త అని, మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేసింది. చిన్మయి-రాహుల్ రవీంద్రన్ తల్లిదండ్రులు కావడంపై నెటజెన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. జీవితంలో మరో ముఖ్యమైన దశలోకి అడుగు పెట్టారని విషెస్ చెప్పారు.

Advertisement

అయితే చిన్మయి పెట్టిన పేర్లును బట్టి చూస్తుంటే కవలల్లో ఒకరు పాపు, మరొకరు బాబు అని తెలుస్తోంది. అయితే కవలలకు జన్మనిచ్చినట్లు చెప్పిన చిన్మయ్.. ఎవరు పుట్టారనేది మాత్రం తెలపలేదు. ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయికి తనదైన గుర్తింపు ఉంది. అయితే ప్రముఖ హీరోయిన్ సమంతకు చిన్మయే డబ్బింగ్ చెప్తుంటుంది. 2014లో హీరో దర్శకుడు, రాహుల్ రవీంద్రన్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

Advertisement