Thank You Movie Review : అక్కినేని నాగ చైతన్య హీరోగా ఒక్కో సినిమాతో నిరూపించుకుంటున్నాడు. లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత.. నాగ చైతన్య బంగార్రాజు మూవీతో అలరించాడు. యావరేజ్ టాక్‌తో నడించింది. ఇప్పుడు థాంక్యూ అనే మూవీతో చైతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు విక్రమ్, కె.కుమార్ నాగ చైతన్య కలిసి తీసిన రెండవ మూవీ కూడా. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. అనుకున్నట్టుగానే జూలై 22, 2022న థియేటర్లలో థాంక్యూ (Thank You Movie) మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి కొంత పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక థాంక్యూ మూవీని ఎంతవరకూ చూడవచ్చు అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
థాంక్యూ మూవీ.. అదో నారాయణపురం అనే మారుమూల పల్లె.. అక్కడ అభిరామ్ (నాగ చైతన్య) జర్నీ సాగుతుంది. అలా అక్కడ మొదలైన అతడి ప్రయాణం.. ఒక బిలియనీర్ స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే స్టోరీ.. అంతేకాదు… ఒక కంపెనీకి యజమాని ఎలా అయ్యాడు అనేది మూవీ.. తన ప్రయాణంలో తనకు ఎవరూ సాయం లేదని, తానంతట తానే ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నానని భావిస్తుంటాడు. కానీ, తన ప్రయాణం వెనుక ఎంతోమంది కృషి ఉందనే విషయం తెలుకుంటాడు. ఆ రోజు నుంచి అభిరామ్ వారి పట్ల తన కృతజ్ఞత చూపాలని భావిస్తాడు. అలా సాగే తన్న జర్నీలో తన ఎదుగుదలకు తోడైనా వారికి ఎలా తన కృతజ్ఞతా భావాన్ని చూపిస్తాడు.. చివరికి అభిరామ్ బిలియనీర్ ఎలా అయ్యాడు అనేది తెలియాలంటే సినిమా థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.
నటీనటులు వీరే :
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించగా.. హీరోగా నాగ చైతన్య, హీరోయిన్ రాశి ఖన్నా నటించారు. మిగతా నటీనటుల్లో మాళవిక నాయర్, సాయి సుశాంత్ రెడ్డి, అవికా గోర్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి విక్రమ్ K కుమార్ దర్శకత్వం వహించారు. ఇక సినిమాటోగ్రఫీని పీసీ చేయగా.. సంగీతాన్ని తమన్ అందించాడు.
Movie Name : | థాంక్యూ (Thank You) |
Director : | విక్రమ్ కే. కుమార్ |
Cast : | నాగ చైతన్య అక్కినేని, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ |
Producers : | రాజు, శిరీష్ |
Music : | తమన్ ఎస్ |
Release Date : | 22 జులై 2022 |
Thank You Movie Review : థాంక్యూ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
నాగ చైతన్య తన సినిమాల్లో చాలావరకూ ఫ్లాప్‌లు ఎదురైనప్పటికీ.. ప్రతి మూవీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టయిల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. థాంక్యూ మూవీలోనూ అభిరామ్ పాత్ర కోసం చాలానే కష్టపడాడు చైతూ.. ఎందుకంటే ఈ రోల్ చాలా సవాలుతో నడుస్తుంది. తన జర్నీని తెలిపే రోల్ అది.. 17ఏళ్ల నుంచి 35ఏళ్ల వరకు అతని లుక్స్, బాడీ లాంగ్వేజ్ పరంగా దాదాపు 4 వేరియేషన్స్ అద్భుతంగా చూపించారు. అభిరాం క్యారెక్టరైజేషన్ మొదట్లోనే చక్కగా సెట్ చేశారు. నాన్‌లీనియర్‌గా వివరించడం బాగుంది. అయితే, ఈ మూవీ మొత్తానికి కృతజ్ఞత అనే పాయింట్ మాత్రం ప్రేక్షకులను సైతం ఎంగేజ్ అయ్యేలా చేసిందనడంలో సందేహం అక్కర్లేదు.
ఇక మూవీలో లోపాలు ఉన్నా.. థాంక్యూను కాసేపు అటు ఉంచితే.. అభిరామ్ ప్రయాణం భావోద్వేగంతో నడుస్తుంది. అభిరామ్ జర్నీ సినిమా ఆధ్యంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీలో భావోద్వేగాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ విషయంలో మరికాస్తా ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. థాంక్యూను చూస్తున్నంతసేపు మలయాళం మూవీ ప్రేమమ్ మాదిరిగా కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ రోల్ సర్‌ప్రైజ్ ప్యాకేజీగా చెప్పవచ్చు. ప్రకాశ్ రాజ్ క్లైమాక్స్ లో అతడే బ్యాక్ ఆఫ్ బోన్ అని చెప్పొచ్చు. అభిరామ్ పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. ఎందుకంటే ఈ రోల్‌లో అనేక వేరియేషన్స్ ఉంటాయి. తాను చేసిన ప్రతి వేరియేషన్ టైమ్‌లైన్ తగినట్టుగా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు.
హీరోయిన్‌గా రాశి కన్నా అవికా గోర్, మాళవిక నాయర్ తమ పాత్రలకు మేరకు నటించారు. అభిరామ్ జర్నీలో ఒక్కొక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ప్రకాష్ రాజ్‌కు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినా ఆ కొద్ది క్షణాల సీన్లలోనూ తనదైన మార్క్ నటననతో మెప్పించారు. ఏదిఏమైనా విక్రమ్ K కుమార్ ప్రేక్షకులను ఎక్కువగా ఎంగేజ్ చేయడంలో పెద్దగా విజయం సాధించలేకపోయాడు. ఈ తరహా కథను ఎంచుకోవడమే కాకుండా మేకింగ్ కొద్దిగా భిన్నంగా ఉండటం కూడా ఒక కారణంగా కావొచ్చు. స్టోరీ బాగానే ఉన్నప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈ మూవీకి ఎంతగా కనెక్ట్ అవుతారు అనేది చూడాలి. టెక్నికల్ టీంకు థాంక్యూ చెప్పాలి.. విజువల్ బాగున్నాయి. థమన్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. చివరగా.. థాంక్యూ మూవీని ప్రతి ఫ్యామిలీతో కలిసి చూడదగిన మూవీ.. నాగచైతన్య నాలుగు వేరియేషన్లు నిజంగా అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సినిమా థియేటర్లకు వెళ్లి థాంక్యూ మూవీ చూస్తేనే ఆ ఫీల్ అందరికి తెలుస్తుంది.
[ Tufan9 Telugu News ]
– థాంక్యూ మూవీ
రివ్యూ & రేటింగ్ : 3.5 /5