Intinti Gruhalakshmi March 23th Today Episode : ప్రతి రోజు స్టార్ మా లో ప్రసారం అవుతూ ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ విలువల గురించి తెలియజేసే ఈ సీరియల్ అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగనుందనే విషయానికి వస్తే…. ప్రేమ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆటో డ్రైవర్ గా మారిపోయాడు. ఆటో తీసుకొని మొదటిరోజు బయలుదేరడానికి ముందు తన అద్దెకుంటున్న అనసూయ తన భర్త బాబురావు తనని సొంత మనుషుల చూసుకుంటున్నారు. మీకు ఎంతో రుణపడి ఉన్నానని ప్రేమ్ చెబుతాడు. ఇక ఆ మాటలన్నీ కాదు మీరు ఆటో ఎక్కండి ప్రేమ్ బాబు మీరు ఎదురుగా రండి శృతమ్మ అని చెప్పగా శృతి ఎదురు వస్తుంది ప్రేమ్ ఆటో నడుపుతూ వెళ్తారు.
ఇలా ఆటో స్టాండ్ కి వెళ్ళిన ప్రేమ్ ఎలాగైనా మొదటి రోజు మంచి బేరం రావాలని దేవున్ని ప్రార్థిస్తూ ఉంటాడు అదేసమయంలో అనసూయ తులసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఆటో అని పిలుస్తారు.వారిని చూసిన ప్రేమ్ కంగారుగా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూనే మొహానికి ఖర్చీఫ్ కట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్లాలి చెప్పండి అనగా మణికొండకు వెళ్లాలని అనసూయ తులసి ప్రేమ్ ఆటోలో వెళుతూ ప్రేమ్ గురించి మాట్లాడుకుంటారు. ఇక మణికొండ వద్దకు వెళ్లగానే ఎంత అయిందని తులసి అడగగా 300 అని ప్రేమ్ చెబుతాడు. తులసి మూడు వందలు తీసి ఇవ్వగా ప్రేమ్ వాటిని కావాలనే కింద పడేసి తులసి ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు తులసి ఆటో డ్రైవర్ గా మారింది తన కొడుకు ప్రేమ్ అని తెలుసుకుంటుంది.
ఇక ఇంటికి వెళ్ళిన ప్రేమ్ ఈరోజు మనం పండగ చేసుకో వాలి మొదటి బోని అమ్మ చేసింది అంటూ సంతోషంగా చెబుతాడు. ఇక అమ్మ నన్ను గుర్తు పట్టకుండా మొహానికి ఖర్చీఫ్ కట్టుకున్నానని, ఇలాంటి పరిస్థితి ఏ కొడుకుకి రాకూడదని ప్రేమ్ బాధపడతాడు. ఇక ఆటో డ్రైవర్ గా ఉన్నది ప్రేమ్ అని గుర్తించిన తులసి తనని నేను ఇంట్లో నుంచి పంపించి ఏమైనా తప్పు చేశానా…వాడు ఇంటి నుంచి బయటకు వెళితే మంచి స్థానంలో ఉంటాడని భావించాను ఇలా మొదటి మెట్టుకు పడిపోయాడు అంటూ తులసి ఆలోచనలో పడుతుంది.

ఇక తులసికి ఫోన్ రావడంతో తన ఫోన్ తన మామయ్య పరంధామయ్య తీసుకువచ్చి ఇస్తాడు. దివ్య కాలేజ్ నుంచి ప్రొఫెసర్ ఫోన్ చేసి దివ్య ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావడం లేదని చెబుతాడు.దీంతో తులసి దివ్య ని పిలిచి ఆన్లైన్ క్లాస్ కి ఎందుకు అటెండ్ కావడం లేదు అని ప్రశ్నించగా నేను కాను నీ డబ్బుతో నేను చదువుకోను మా డాడీ డబ్బు కట్టిన తరువాతే చదువుకుంటాను అని మాట్లాడుతుంది. మరోవైపు లాస్య నందు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా కార్ ట్రబుల్ ఇస్తుంది. క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించగా క్యాబ్ అందుబాటులో లేకపోవడంతో ఆటో పిలుస్తారు.
అయితే ఆటోలో నుంచి దిగిన ప్రేమ్ ను చూసి లాస్య వెటకారంగా తనని హేళన చేస్తూ మాట్లాడుతుంది. రాక్ స్టార్ అయ్యే నువ్వు ఇలా ఆటోడ్రైవర్గా మారిపోయావా నేను నీ అపాయింట్మెంట్ తీసుకోవాలా అంటూ లాస్య తనని ఎత్తి పొడుస్తుంది. దాంతో ప్రేమ్ వారికి తగిన విధంగా సమాధానం చెప్పి అక్కడినుండి వెళ్తాడు. ఇక తులసి పరంధామయ్యతో మాట్లాడుతూ నేను ప్రేమ్ ఇంటి నుంచి బయటకు పంపించింది ఎందుకు మామయ్య… వాడు బాగుపడటం కోసం వాడికి నేను బలహీనం కాకూడదని ఇంటి నుంచి బయటకు పంపించాను అంటూ పరంధామయ్యతో మాట్లాడుతుండగా ఆ మాటలు విన్న దివ్య అసలు విషయం తెలుసుకొని మామ్ నన్ను క్షమించు అంటూ తులసి కాళ్ళపై పడి క్షమాపణలు కోరుతుంది. తర్వాత ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది.
Read Also : Intinti Gruhalakshmi: ప్రేమ్ ని నిలదీసిన శృతి.. ప్రేమ్ దగ్గరికి చేరుకున్న దివ్య..?