Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ్ ఇంటి ఓనర్ లు రాములమ్మ కలసి ప్రేమ్ కి బర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తారు. ఇక రాములమ్మ కేక్ తెచ్చి ప్రేమ్ తో కేక్ కట్ చేపిస్తుంది. అది చూసిన ప్రేమ్, శృతిలో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఇంటి ఓనర్ లు ఆటో నడపడానికి కీస్ ని సిద్ధం చేస్తారు. ఇక శృతి కి అసలు నిజం తెలియడంతో ఆమె బాధపడుతూ ఉంటుంది.
మరొకవైపు ప్రేమ్ ను ఇంటికి పిలిచి బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాము అని అంకిత తులసి నో అడగగా తులసి ఒప్పుకోదు. మరొకవైపు ప్రేమ్ ఆటో నడపాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఇది తెలిసిన ఆ శృతి ఎందుకు నన్ను పరాయి దానిలా చూస్తున్నావు. నాతో మనసు విప్పి ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు అంటూ ప్రేమ్ నిలదీస్తుంది.
అప్పుడు ప్రేమ్, శృతికి సర్డి చెబుతాడు. అప్పుడు ప్రేమ్ రొమాంటిక్ గా మాట్లాడగా సరే పదా నీకు శిక్ష వేస్తాను అని ఫన్నీగా అంటుంది. మరొకవైపు తులసి ప్రేమ్ పుట్టినరోజు నాడు కనీసం బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు అని బాధపడుతూ ఉంటుంది.
ఆ సమయంలో తులసి మామయ్య వచ్చి తులసి ఓదారుస్తూ ఉంటాడు. మరొక వైపు ప్రేమ్, శృతి లు ఆనందంగా రొమాంటిక్ గా ఉరకలు వేస్తూ ఉంటారు. ఈలోపు అక్కడికి వచ్చిన దివ్య ఇద్దరినీ చూసి ఎంతో ఆనంద పడుతుంది. ఆ తర్వాత ప్రేమ్ బాగోగుల గురించి అడుగుతుంది.
దివ్య ప్రేమ్ తో మాట్లాడుతూ తులసి గురించి నెగిటివ్గా చెబుతుంది. మరొకవైపు తులసి ప్రేమ్ చాలా ఎత్తుకు ఎదగాలి అనే దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రేమ్ అనుకున్న విధంగానే ఆటోను కొనుకుంటాడు. శృతి ఆటో కి పూజా చేస్తుంది.ప్రేమ్ అనుకోకుండా తులసి ని ఆటోలు ఎక్కించుకుంటారు.రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.