Intinti Gruhalakshmi March 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బాగానే ఆకట్టుకుంటోంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి ఒంటరిగా ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి తులసీ మామయ్య వస్తాడు. ప్రేమ్ ఒక దారిలో పెట్టాలి అనుకుంటే నేనే దారి తప్పించే ఎలా చేస్తున్నానా అంటూ వాళ్ళ మామయ్య అని అడుగుతుంది. నేను ప్రేమ్ మంచి కోరి, వారిని ఒక దారిలో పెట్టాలని ఇంటి నుంచి బయటకు పంపించేశాను అని బాధపడుతూ ఉంటుంది.
అందుకే ఎవరు ఎన్ని మాటలు అన్నా మనసు బాధగా ఉన్నా కూడా ఓర్పుగా అన్ని భావిస్తున్నాను అని అంటుంది. అయితే తులసి తన మామయ్య తో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా పక్కన ఉండి దివ్య వింటుంది. తన తల్లి మాటలు విన్న దివ్య ఎమోషనల్ అవుతూ తన తప్పును తెలుసుకొని తులసి కాళ్ళపై పడుతుంది.
క్షమించు మమ్మీ నీ మంచితనం తెలియక ఇన్ని రోజులు నేను నిన్ను బాధపెట్టాను. దెయ్యం పట్టిన దానిలా ప్రవర్తించాను అంటూ తులసి కాళ్ళు పట్టుకుని ఏడవగా అప్పుడు తులసి హత్తుకుంటుంది. అప్పుడు నేను మీ తాతయ్య మాట్లాడుకున్న మాటలు ఎవరికీ చెప్పొద్దు దివ్య చెబుతుంది తులసి. ఆ తర్వాత తులసి మాధవి కి కాల్ చేసి ప్రేమ్ ఆటో నడపడం నాకు నచ్చలేదు, వాడిని సంగీత విద్యను నేర్చుకోవాలంటే ఇలా ఆటో నడుపుతున్నాడు ఎలా అయినా నువ్వే వాడిని ఒప్పించు, దానికి ఎంత డబ్బు కావాల్సిన నేను ఇస్తాను అని అంటుంది తులసి. అందుకు సరే అంటూ మాధవి ప్రేమ్ శృతి ల ఇంటికి వెళుతుంది.
మరొకవైపు లాస్య ఇంట్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ బయటకు వెళ్లి పోవడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో నందు రాగా ఎక్కడికి ఏం జరిగింది అని అనగా ఏమి జరగలేదు నీకు ఏమి తెలియదు ఒట్టి అమాయకుడివి అంటూ నందు ఫై మండి పడుతుంది. మరొకవైపు తులసి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పని మనిషి రాములమ్మ వచ్చి తులసితో మాట్లాడుతుండగా ఇంతలో హోలీ పండుగ సందర్భంగా దివ్య వచ్చి తులసికి రంగు పూసే ప్రయత్నం చేస్తుంది.
మరొకవైపు ప్రేమ్ ఇంట్లో అంకిత, అభి, దివ్య, శృతి లు హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన తులసికి ప్రేమ్ రంగు పూసి హ్యాపీ హోలీ అని చెబుతాడు. అప్పుడు తులసి రంగులను కోపంతో విసిరేసి అమ్మకి ఇచ్చిన మాటను గాలికి వదిలేసి అడ్డదారిలో బతుకుతున్నావు అంటూ ప్రేమ్ పై విరుచుకు పడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi : ప్రేమ్ ఆటో నడపడం చూసి షాక్ అయిన తులసి… తన తప్పు తెలుసుకొని తులసి కాళ్లపై పడ్డ దివ్య!