Horoscope : ఈ వారం అంటే మే 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ఈ రెండు రాశుల వారికి ఉద్యోగంలో చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఆ రెండు రాశులు ఏంటి, వారికి కల్గబోయే లాభాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారిని ఈ వారం బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఎటు చూసినా శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఎదురు చూస్తున్న పని కచ్చితంగా పూర్తి అవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. సదవకాశాలు వస్తాయి. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. ఇష్ట దేవత ఆరాధన శ్రేష్ఠం.
అలాగే వృశ్చిక రాశి… ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ముఖ్యకార్యాల్లో శీఘ్ర విజయముంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. అపోహలు తొలగుతాయి. కొత్తబంధాలు చిగురిస్తాయి. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. గృహవాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తుప్రాప్తి సూచితం. సూర్యనమస్కారం శుభప్రదం.
Horoscope : ఈరోజు ఈ రెండు రాశి వాళ్లకు ఉద్యోగ సమస్యలు.. జాగ్రత్త చాలా అవసరం!