Horoscope May 26 Today : ఈరోజు అంటే గురువారం రోజు ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఉద్యోగంలో అనేక సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది.
ముందుగా మేష రాశి.. ఈ రాశి వాళ్లకి ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది. అలాగే అనవసర విషయాల్లో అస్సలే జోక్యం చేసుకోకూడదు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్ల కుండా చూసుకోవాలి. నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.
వృశ్చిక రాశి.. చంచల స్వభావం కారణంగా.. ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడాలి. సంతోషంగా ఉంటారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శివ దర్శనం మేలు చేస్తుంది.
Read Also : Nagadosham : నాగదోషం ఉంటే ఈ సంకేతాలు నిజంగానే కనిపిస్తాయా.. నిజమెంత?