Horoscope: ఈరోజు అనగా జులై 16వ తేదీ శనివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు చాలా బాగుందని.. అధికారుల ప్రశంసలు అందుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి.. ఈ రాశి వాళ్లకు అంటే వృశ్చిక రాశి వాళ్లకు మనఃస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలొ పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి చేకూరుతుంది. పై అధికారులు మీ పని తీరును మెచ్చి ప్రశంసల వర్షం కురిపిస్తారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.
ధనస్సు రాశి.. ధనస్సు రాశి వాళ్లకు కృషి ఫలిస్తుంది. ఉద్యోగం చేసే చోటు పై అధికారులు మీ పని తీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవి స్తుతి చేయాలి.