Horoscope : ఈరోజు అంటే జులై 15వ తేదీన ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశఇ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపణులు తెలిపారు. ముఖ్యంగా ఓ రెండు రాశుల వారు మాత్రం పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. లేదంటే ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Horoscope : ఈరోజు మిథున రాశి,కుంభ రాశి వారికి కష్టాలు.. జాగ్రత్తగా ఉండాలి…
మిథున రాశి.. చేపట్టబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. లేదంటే ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. గిట్టని వారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కల్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవ ధ్యానంతో ఆపదల నుంచి బయట పడతారు.
కుంభ రాశి.. ఈ రాశి వాళ్లు రెట్టటించిన ఉత్సాహంతో పని చేయాలి. సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. సమర్థతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శ్రీ వేంకటేశ్వరుని సందర్శనం శుభకరం
Read Also : Horoscope: నేడు ఈ రాశుల వారికి ఆటంకాలు ఎక్కువే.. అవసరానికి సాయమూ ఎక్కువే!