Horoscope: ఈ రోజు అనగా సెప్టెబర్ 3వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి చాలా బాగుంటుందని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి.. సింహ రాశి వాళ్లకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. కుటుంబ సభ్యులకు శుభ కాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవము పఠించాలి.
మకర రాశి.. కర రాశి వాళ్లకు అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విజయావకాశాలు మెరుగు అవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.