Horoscope : ఈ రోజు అనగా ఆగస్టు 30వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి చాలా బాగుంటుందని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు ఆయా రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగు అవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. ఇష్ట దేవతా ఆరాధనం శభప్రదం.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకు శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శివారాధన శుభప్రదం.