Horoscope: ఈ రోజు అనగా సెప్టెబర్ 3వ తేదీ నాడు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. మేష రాశి వాళ్లు ఈరోజు ఏ పని ప్రారంభించినా అందులో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వీలయినంత వరకు ఈరోజు కార్యాలు తలపెట్టకపోవడమే మంచిది. అలాగే ఈరోజు దగ్గరి వాళ్లలో లేదా స్నేహితుల్లో కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కాబట్టి వీలయినంత వరకు ఎవరితోనూ అతిగా మాట్లాడడం కానీ, తిరగడం కానీ చేయకండి. దానివల్లే మీరే మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కోపం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. గోసేవ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి.. సింహ రాశి వాళ్లకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అలా అని విపరీతంగా కష్టపడిపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలయినంత వరకు మాత్రమే పని చేయండి. అతిగా చేసి ఆరోగ్యం మీదకు తెచ్చుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దీని వల్ల మిమ్మల్ని రోజంతా ఎవరో ఒకరు బాధ పెడుతూనే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలయినంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రాధాన్యతను ఇవ్వండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లేదంటే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది.