Samantha Shocking comments: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. వీటితో పాటు విజయ త్ ఖుషఈ, హిందీ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ అమ్మడు.
ఇదిలా ఉండగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. అంతే కాదు హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సమంత ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. అందేంటంటే.. సినిమాల్లో గ్లామర్ రోల్స్, పిల్ లాక్ సహా ఇంటిమేట్ సీన్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.
ఇలాంటి కండీషన్స్ కి ఒప్పుకుంటనే ఆమె సినిమాలకు సైన్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్లలో నటించడం వల్లే తనకు, నాగ చైతన్యకు విబేధాలు తలెత్తాయని.. ఈ క్రమంలోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.