Viral video : వామ్మో.. భారీ కొండచిలువను భుజాలపై మోసుకెళ్లిన వ్యక్తి.. భయానక వీడియో..!

Viral video : కొందరు చిన్న పాము చూస్తేనే జడుసుకుంటారు. పాము పడగ విప్పి బుసలు కొడితే గుండె జారి గల్లంతు అవుతుంది. అలాంటి ఓ భారీ కొండ చిలువ కంటికి కనిపిస్తే పై ప్రాణాలు పైకే పోతాయి. కానీ ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ కొండ చిలువను భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్నాడు. చాలా లావుగా పొడుగ్గా ఉన్నా ఆ కొండ చిలువను భుజాలపై వేసుకుని మెట్లు ఎక్కుతున్నాడు ఆ వ్యక్తి. దానిని అలా తీసుకుని వెళ్లి ఓ గదిలోకి వెళ్లినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఇలా అతను భారీ కొండ చిలువను మోసుకెళ్లడాన్ని అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

వరల్డ్ ఆఫ్ స్నేక్ అనే పేజీ అడ్మిన్లు ఈ వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. వేల కొద్దీ కామెంట్స్ వస్తున్నాయి. ఈ అతి భారీ కొండ చిలువను ఆయన అలా తీసుకెళ్లడంపై చాలా మంది ‘నువ్వు గ్రేట్ సామీ’, ‘వామ్మో ఆ కొండ చిలువను స్క్రీన్ పై చూస్తుంటేనే భయం వేస్తోంద’ని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదెక్కడి కొండచిలువరా అయ్యా’, ‘అనకొండ సినిమాలో నటించింది ఇదేనా ‘ అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.

Read Also :  రారా.. రక్కమ్మ డాన్స్‌‌తో చీరకట్టులో రెచ్చిపోయిన పూర్ణ.. వీడియో!