Horoscope : ఈరోజు అంటే మే 21వ తేదీ రోజున ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా రాశి ఫలాలు ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు మాత్రం ఈరోజు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణు చెబుతున్నారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి, ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా వృషభ రాశి… ఈ రాశి వారి ఓర్పునకు ఇది పరీక్షా కాలం. మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే అపకీర్తిని మూట కట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షాస్తోత్రం చదవడం శుభప్రదం.
కుంభ రాశి… ఈ రాశి వారికి ఈరోజు చాలా శ్రమ పెరుగుతుంది. అనవసర విషయాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు, మిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. లేదంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే వాటి నుంచి తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
Read Also : Horoscope: ఈ రెండు రాశుల వారు లక్ష్మీ దేవిని స్తుతిస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!