Horoscope: ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈ రెండు రాశుల వారికి చాలా లాభాలు కల్గబోతున్నాయి. కాకపోతే లక్ష్మీ దేవిని స్తుతించడం వల్ల వారి పనులు మరింత సులభం అయి… ఆర్థికంగా చాలా పురోగతిని సాధిస్తారు. అయితే ఆ రెండు రాశులు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి.. ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ పరంగా అభివృద్ధీ ప్రశంసలూ ఉంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. దివ్యమైన ఆలోచనలు వస్తాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సూచితం. బంగారు భవిష్యత్తును సాధిస్తారు. అయితే లక్ష్మీదేవి ధ్యానం చేయడం వల్ల మీరు చేయబోయే పనుల్లో త్వరగా విజయం సాధిస్తారు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి… అత్యంత శ్రేష్ఠమైన కాలం. తిరుగులేని ఫలితాలు సాధిస్తారు. ఘనకీర్తిని పొందుతారు. ఉద్యోగ ఫలితాలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు జీవితం లభిస్తుంది. వ్యాపారబలం ఉంది. ఆర్థికంగా కలిసొస్తుంది. సంపద పెరుగుతుంది. లక్ష్మీ దేవిని స్తుతించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగి.. అన్నింటిని త్వరగా పొందుతారు.