ఈరోజు రాశి ఫలాలు ఫలితాలను బట్టి ఈ మూడు రాశుల వాళ్లకు అధిక శుభ ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పనినైనా వీరు ఈరోజు మొదలు పెడితే సులువుగా చేసేయొచ్చు. అయితే ఈ రాశుల వాళ్లు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సింహ రాశి.. మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.
వృశ్చిక రాశి… గొప్ప శుభకాలం. మనో ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. ఇష్ట దేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.ధనస్సు రాశి.. ప్రారంభించిన పనులను విజయ వంతంగా పూర్తిచేయ గలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది.