Astrology: బుధుడు, కుజ గ్రహాల అనుగ్రహం వల్ల పలు రాశుల వారికి విశేషమైన సానుకూల ప్రతిఫలాలు వస్తాయి. మరి ఏయే రాశుల వారికి ఎలాంటి శుభాలు కల్గుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు, బుధ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సొంత రాశుల్లోకి బుధుడు, కుజుడు రావడం వల్ల ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వాళ్లకు చాలా లాభం కల్గబోతోంది. ముందుగా మేష రాశి వారికి ఉద్యోగంలో పని పరిస్థితులు మెరుగుపడుతాయి. మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. తల్లి నుంచి ధనలాభం కల్గుతుంది. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యా రంగానికి చెందిన వారికి విజయం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీరు చేసే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు.
మిథున రాశి వాళ్లకు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. వస్త్రాలు, ఆభరమాలు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో చాలా హాయిగా గపపబోతున్నారు. వృశ్చిక రాశి వాళ్లకు… మానసిక ప్రశాంతత, సంతోషం కల్గుతుంది. విద్యా సంబంధ విషయాల్లో సానుకూల ఫిలాతులు ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారుల సహకారం అభిస్తుంది. దుస్తులు మొదలైన వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్లకు… మీ పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.